మండపేట: మండపేట బస్‌స్టాండ్‌లో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. బస్‌స్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన దీపాలంకరణ వేడుకల్లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గణనాథుడికి పూజలు నిర్వహించారు.