కైరిగూడెం గ్రామ కార్యదర్శి సస్పెండ్
NEWS Sep 14,2024 03:31 am
రాయికల్ మండలం కైరిగూడెం గ్రామ కార్యదర్శి వెంకటేశ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో ఒకరి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తానని రూ.30వేలు తీసుకున్నాడని, పెన్షన్ పంపిణీ చేసే సమయంలో రూ. 100తక్కువ ఇస్తున్నాడని గ్రామస్థులు ఫిర్యాదు చేయగా, ఈ ఆరోపణలపై 2రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆగస్టు 14న అధికారులు మెమో ఇచ్చారు. మెమో పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేశారు.