ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ, తహశీల్దార్
NEWS Sep 14,2024 03:19 am
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ చంద్రశేఖర్ ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 85 మందికి కంటి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.