గ్రామపంచాయితీ ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వార్డుల వారిగా ఓటర్ల జాబితాను శుక్రవారం విడుదల చేసినట్లు ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. 15గ్రామాల్లోని వార్డుల వారిగా ఓటర్ల జాబితాను రూపొందించి ఆయా గ్రామపంచాయితీ కార్యాలయాల్లోని, ఎంపీడీఓ కార్యాలయంలో నోటీస్ బోర్డుపై ఉంచినట్లు పేర్కొన్నారు.