బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
వరద బాధితులకు ఆర్థికసాయం
NEWS Sep 14,2024 08:01 am
ఖమ్మంలో చోటుచేసుకున్న వరద భీభత్సంలో నిరాశ్రయులైన బాధితులకు పట్టణంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా బార్ అసోషియేషన్ అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారీవర్షాల కారణంగా ఖమ్మంలో చోటుచేసుకున్న వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వారికి చేదోడుగా తమవంతు సాయంగా రూ.20వేల విరాళాలను మండల రెవెన్యూ అధికారికి అందజేసినట్లు తెలిపారు.