జగ్గాసాగర్: వినాయకుడికి మహా నైవేద్యం
NEWS Sep 14,2024 03:30 am
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం భరత్ నగర్ యువసేన ఆధ్వర్యంలో వినాయకుడికి మహా నైవేద్యం సమర్పించారు. భక్తులు 108 రకాల ప్రసాదాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అంతకుముందు వినాయకుడికి పాలుపండ్లు చక్కెర నెయ్యిలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భజనలు, కీర్తనలు చేపట్టారు. శనివారం ఉదయం కుంకుమపూజ హోమం నిర్వహించనునట్లు తెలిపారు.