కొండగట్టు: తలనీలాల టెండర్ వాయిదా
NEWS Sep 14,2024 03:19 am
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో తలనీలాలు పోగుచేసుకునే హక్కు వాయిదా పడింది. శుక్రవారం ఎండోమెంట్ ఆఫీస్లోని ధ్యాన మందిరంలో ఆలయ అధికారులు టెండర్ నిర్వహించారు. 10 మంది కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొని, రూ.1.68 కోట్ల వరకు పాట పాడినట్లు ఈఓ తెలిపారు. అది సరైన పాట కానందున టెండర్ వాయిదా వేసినట్లు, తిరిగి ఈ నెల 30న టెండర్ నిర్వహిస్తామని ఈఓ పేర్కొన్నారు