దువ్వాడ మీదుగా సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డుకు స్పెషల్ ట్రైన్
NEWS Sep 14,2024 03:31 am
పండగల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డుకు స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్లు సీనియర్ DCM కె సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు(07487)రైలు అక్టోబర్ 2 నుండి నవంబర్ 6 వరకు ప్రతి బుధవారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి దువ్వాడ మీదుగా శ్రీకాకుళం రోడ్డుకు చేరుతుందన్నారు. అలాగే శ్రీకాకుళం రోడ్డు - సికింద్రాబాద్(07488)రైలు అక్టోబర్ 3 నుండి నవంబర్ 7 వరకు ప్రతి గురువారం సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం రోడ్డు లో బయలుదేరి దువ్వాడ మీదుగా సికింద్రాబాద్ చేరుతుంది