ఆధునీకరణ పనులు కారణంగా విశాఖ-పలాస-విశాఖ (07470 / 07471) MEMU పాసింజర్ గమ్యస్థానం కుదింపు జరుగుతుందని సీనియర్ డీసీఎం కే సందీప్ తెలిపారు. సెప్టెంబర్ 19 నుండి 21 వరకు విశాఖ నుండి బయలుదేరే విశాఖ-పలస(07470) MEMU పాసింజర్ శ్రీకాకుళం రోడ్డు వరకు వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణం పలస-విశాఖ MEMU(07471) పాసింజర్ శ్రీకాకుళం రోడ్డు నుండి బయలుదేరి విశాఖ చేరుతుందన్నారు