మల్యాలలో ఘనంగా పోషణ మాసం
NEWS Sep 14,2024 03:28 am
మల్యాల రైతు వేదికలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సమ్యూద్దీన్ మాట్లాడుతూ గర్భిణీలు,బాలింతలలో రక్తహీనతను నివారించి,పిల్లల్లో పోషణ స్థాయిని పెంపొందించడానికి ప్రభుత్వo నిర్ధిష్టమైన లక్ష్యాలతో పని చేస్తుందన్నారు.IFA టాబ్లెట్స్ గర్భిణిలు క్రమం తప్పకుండా వేసుకోవాలి అన్నారు. అనంతరం శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రత్యేకమైన పోషక ఆహర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.