జగిత్యాల జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని వినాయక మండపాల్లో శుక్రవారం మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ నిర్వహించారు. కుంకుమ పూజ అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.