మెట్ పల్లి పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లో సులబ్ కాంప్లెక్స్ ఎదురుగా డ్రైనేజీపై ఉన్న మ్యాన్ హోల్ పూర్తిగా ధ్వంసమైంది. వర్షం నీరు ప్రవహిస్తే మ్యాన్ హోల్ కనిపించదు. వాహనదారులు అదుపుతప్పి పక్కకు పడ్డట్టు స్థానికులు తెలిపారు. పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి నూతన మ్యాన్ హోల్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.