ప్రజలందరూ సంతోషంగా ఉండాలి: ఎమ్మెల్సీ
NEWS Sep 14,2024 03:27 am
రాయికల్: రాయికల్ పట్టణంలోని విశ్వయూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. పట్టణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, పాడిపంటలు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీనాయకులు, యూత్ అధ్యక్షుడు చంద్రతేజ, ఉపాధ్యక్షుడు బి. రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.