నిల్వ ఉంచిన కలప పట్టివేత
NEWS Sep 14,2024 03:27 am
రాయికల్ పట్టణంలో పలు చోట్ల దాడులు నిర్వహించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా నిల్వ ఉంచిన కలప, సామగ్రిని పట్టుకొని అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు ఎస్ఆర్వో భూమేశ్ తెలిపారు. అదే విధంగా అనుమతి లేకుండా నడిపిస్తున్న మిషన్లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి పద్మ, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.