MNCL: మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో గల శ్రీమన్నారాయణ గణేష్ మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవి కుంకుమ పూజలు నిర్వహించి లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై ఎల్లవేళలా ఉండాలని మొక్కలు చెల్లించుకున్నారు. పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.