మల్లాపూర్: ఆరోగ్య మహిళా కార్యక్రమం
NEWS Sep 13,2024 04:47 pm
మల్లాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎ.వాహిని ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మంచి ఆరోగ్యానికి ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు తీసుకోవాలని సూచించారు. అనంతరం గర్భిణులకు మందులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.