పోర్చుగల్‌కు చెందిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో.. ఆటలో ఇప్పటికే ఎన్నో రికార్డును బద్దలు కొట్టాడు. తాజాగా సోషల్ మీడియాలోనూ నం.1 రికార్డు సాధించాడు. సోషల్ మీడియాలో తన ఖాతాలన్నింటీలో కలిపి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటింది. భూమ్మీద ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఇటీవలే తన కెరీర్‌లో 900 గోల్‌లను సాధించి చరిత్ర సృష్టించాడు.