మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
NEWS Sep 13,2024 04:59 pm
మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో శుక్రవారం ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ను డిఆర్డీ ఓపీడీ రఘువరన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వం ద్వారా అందించే రుణాలు తీసుకొని ఉపాధి పొందాలని, దీనికోసం కావలసిన శిక్షణలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ చరణ్ దాస్, స్ట్రీనిధి ఆర్ఎం భూకైలాస్, ఏపీఎం రాజయ్య, సీసీలు గంగరాజం, మల్లేశం, ప్రభాకర్, కృష్ణమోహన్, వివోఏ పుష్పలత, వివోఓఓబి లు ఎస్ హెచ్ జి సభ్యులు పాల్గొన్నారు.