గబ్బాడకి నివాళులర్పించిన శ్రావణ్
NEWS Sep 13,2024 04:58 pm
అరకు: TDP ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గబ్బాడ సింహాచలం మరణం పార్టీకి తీరనిలోటు అని TDP అరకు పార్లమెంటు అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. గబ్బాడ సింహాచలం మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని శ్రావణ్ పేర్కొన్నారు. ఈ మేరకు గుడివాడ లోని సింహాచలం పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సింహాచలం కుటుంబ సభ్యులను ఓదారుస్తూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.