మల్యాల: రేషన్ బియ్యం పట్టివేత
NEWS Sep 13,2024 04:57 pm
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలోని పెద్దమ్మ వాళ్ళ కాలనీలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంను శుక్రవారం సివిల్ సప్లై అధికారులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు. సివిల్ సప్లై డీటీ శ్రీనివాస్, ఎస్ఐ నరేష్ అధ్వర్యంలో షెడ్డు లో నిల్వ చేసిన 70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని, స్థానిక గోదాంకు తరలించారు. ఇక్కడ ఎఫ్ఐ స్వామి, ఆర్ఐ తిరుపతి, కానిస్టేబుల్స్ ప్రసాద్, నరసింగరావు, ఉన్నారు.