అరకు: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ హిందీ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా కెబికె నాయక్ మాట్లాడుతూ.. దేశ రాజభాష హిందీ విద్యార్థులందరూ నేర్చుకోవాలని కోరారు. హిందీ దివాస్ లో భాగంగా హింది కవుల చిత్రపటాలకు పూలతో అలంకరించారు. హిందీ నేర్చుకోవటం వలన ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని హిందీ అధ్యాపకులు సుందరి రాణి సూచించారు. వైస్ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ పిఓలు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.