పట్టుబడిన 50 కేజీల గంజాయి
NEWS Sep 13,2024 04:56 pm
అరకు: అరకులోయ మండలంలో పోలీసుల తనిఖీల్లో బాగంగా స్ధానిక రాజధాని జంక్షన్ వద్ద కేరళకు చెందిన కారులో రవాణా చేస్తున్న 50 కేజీల గంజాయి పట్టుకున్నట్లు అరకు సిఐ హిమగిరి, ఎస్ఐ సంతోష్ తెలిపారు. ఈ మేరకు సిఐ, ఎస్ఐలు మాట్లాడుతూ.. పట్టుబడిన కారుతో పాటూ కేరళ రాష్ట్రం వరవలయల్ గ్రామానికి చెందిన నసీబ్, ఒడిస్సా రాష్ట్రం చిత్రకొండకు చెందిన తుమ్నాద్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన 50 కేజీల గంజాయి సుమారు రూ. 2 లక్షలు ఉంటుందన్నారు.