శేర్లింగంపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ నాయకులు హాజరు కాకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందంచక్రపాణి మాట్లాడుతూ నేతల అక్రమ అరెస్టులపై నిర్బంధాలపై హౌస్అరెస్టులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి సమావేశాలు నిర్వహించుకునే హక్కులేకుండా పోయిందని ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని కచ్చితంగా సరైన సమాధానం చెప్తారని అన్నారు.