పేకాట శిబిరంపై పోలీసులు దాడి
NEWS Sep 13,2024 04:23 pm
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై జగ్గంపేట పోలీసులు దాడులు నిర్వహించారు. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో కలిసి శుక్రవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. పే దాడుల్లో అయిదుగురు పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 10,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నామన్నారు.