జిల్లా పోలీసు శాఖ ఆద్వర్యంలో
మానాలలో ఉచిత వైద్య శిబిరం
NEWS Sep 13,2024 04:24 pm
సిరిసిల్ల: పోలీసుల ఆద్వర్యంలో శాంతి భద్రతల సేవలు అందించడంతో పాటు వైద్య శిబిరాలు అభినందనీయమని ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్ కొనియాడారు. రుద్రంగి మండలం మానాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్య శాఖ, అశ్వినిహాస్పిటల్, రెనే హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఆది శ్రీనివాస్, రాష్ట్ర యూనియన్ కోపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీఅఖిల్ మహాజన్ ప్రారంభించారు.