సిరిసిల్ల జిల్లా: శేర్లింగంపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విస్తృతస్థాయి సమావేశంకు వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణిని, పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి ని శుక్రవారం ఉదయమే పోలీసులు వారింటికి చేరుకొని ఇంటి బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.