బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆద్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేతికి సంకెళ్ళతో నిరసన వ్యక్తం చేశారు. పట్టపగలు BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో ఫ్యాక్షనిజం రౌడీయిజానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డాగా మారుస్తుందని ఈ దాడి CM రేవంత్ రెడ్డి చేయించాడని ఆయన మండిపడ్డారు.