నిమజ్జనం వైభవంగా నిర్వహించాలి
NEWS Sep 13,2024 04:27 pm
సిరిసిల్లలో నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిమజ్జనోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు మానేరు తీరంలో చేస్తుండగా, ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా,ఆర్డీవో రమేష్,అధికారులు పాల్గొన్నారు.