డుంబ్రిగుడ: డుంబ్రిగుడ నూతన ఎస్సైగా కెల్ల పాపినాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఎస్సైగా పనిచేసిన కే. సంతోశ్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో పాపినాయుడు నియమితులయ్యారు. ఈమేరకు ఆయన నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఎస్సై పాపినాయుడును స్టేషన్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.