చురుగ్గా తుప్పలు తొలగింపు
NEWS Sep 13,2024 04:29 pm
అరకు టౌన్ షిప్ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా భారీగా పెరిగిన తుప్పలను తొలగించే కార్యక్రమాన్ని పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు ప్రారంభించారు. జెడ్పీ కాలనీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా, హాస్పటల్ ఏరియా, మెయిన్ రోడ్డు కిరువైపులా ఉన్న తుప్పలను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులను సర్పంచ్ దాసుబాబు దగ్గరుండి చేయిస్తున్నారు. వర్షాలు కారణంగా రోడ్డుకి ఇరువైపులు పెరిగిన తుప్పలు తొలగించి అవసరమైన చోట మొక్కలను నాటాలనుకుంటున్నారు.