ఏచూరి చిత్ర పటానికి నివాళులు
NEWS Sep 13,2024 04:32 pm
అనంతగిరి మండల కేంద్రం గిరిజన సంఘం కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్ర పటానికి అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు, సిపిఎం శ్రేణులు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ సిపిఎం పార్టీకి ఎన్నో సేవలు చేసి, తమలాంటి వారికి పెద్ద దిక్కు లాంటి నేత కన్ను ముయడంతో తీరని లోటు అని కొనియాడారు. ఈ కార్యక్రమం అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు, అనంతగిరి సిపిఎం పార్టీ మండలం కార్యదర్శి ఎస్ నాగులు, అనంతగిరి ఉప సర్పంచ్ పి అర్జున్ పాల్గొన్నారు.