ప్రకాష్ నగర్ సీఐగా బాజీలాల్
NEWS Sep 13,2024 04:34 pm
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐగా ఆర్ఎస్స్కే బాజీలాల్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో సైబర్ సెల్, సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అయనను స్టేషన్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.