అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెడికల్ పింఛన్లు పొందుతున్న 668 మంది లో 281 మంది మెడికల్ పింఛన్లు పొందటానికి అనర్హులు అని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. 281 మంది లో 255 మంది దివ్యాంగ పింఛన్లు పొందడానికి అర్హులు కాదు అన్నారు. అర్హత లేనప్పటికీ అర్హత ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.