ఎన్టీఆర్ జిల్లా TDP అధ్యక్షులు నెట్టెం రఘురామ్,MLA శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు,కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి.రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.