వరద బాధిత మృతుని కుటుంబానికి
5 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
NEWS Sep 13,2024 04:39 pm
మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శెట్టిపల్లి కృష్ణారెడ్డి (43) ఇటీవల ప్రమాదవశాత్తు జమ్మడుగు వాగులో వరదనీటిలో పడి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరైంది. MLA వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్వడం గ్రామంలో మృతుని నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు.