తెలంగాణ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 17న వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు మూసేయాలని స్పష్టం చేశారు.