అరకు: కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అరకులోయ కాంగ్రెసు నాయకులు పాచిపెంట చిన్నస్వామి అన్నారు. కాంగ్రెసు నాయకులు సీతారాం ఏచూరి చిత్ర పటానికి పూలమాల మాల వేసి నివాళులర్పించారు. చిన్నస్వామి మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి పీడిత ప్రజలకు న్యాయం జరగడం కోసం పార్లమెంటులో పోరాడేవారని కొనియాడారు.