సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితోపాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు అభివృద్ధి దిశగా పనిచేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈనెల 17న ప్రజా పాలన రెండో విడత సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించాలన్నారు.