ఆ యాత్రికులు రప్పించేందుకు చర్యలు
NEWS Sep 13,2024 04:45 pm
కేదార్‌నాథ్‌లో 18 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వారిని స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నాం. ఈలోగా వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరాం. యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు.