మాజీమంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సంఘీభావంగా మాజీ మంత్రి హరీష్ రావు వద్దకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేపట్టిన నాయకులను నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మైనార్టీ రాష్ట్ర నాయకులు మోహిద్ ఖాన్, సంతోష్ రెడ్డి తదితరులు ఉన్నారు