పెద్దపల్లి: ప్రైవేట్ ఆసుపత్రులు బంద్
NEWS Sep 13,2024 05:43 am
పెద్దపల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ వైద్యుడిపై రోగి బంధువుల దాడి ఘటనను నిరసిస్తూ సాధారణ, అత్యవసర వైద్యసేవలు నిలిపివేస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రతినిధులు ప్రకటించారు. వైద్యులపై దాడులు ఆపకుంటే పెద్దఎత్తున ఆందోళనలు తప్పవన్నారు. ఐఎన్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కాళీ ప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య బృందం నేడు జిల్లాలో పర్యటించనుంది.