వైఎస్ జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు మెమో ఇవ్వనున్నట్టు జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలుంటాయన్నారు. గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను జగన్ మొన్న పరామర్శించారు. బయటకు వచ్చిన జగన్‌తో అదే జైలులో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషాబాను కుమార్తెతో కలిసి వచ్చి సెల్ఫీ దిగారు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు ఆమెకు మెమో ఇవ్వనున్నట్టు తెలిపారు.