బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిన్న ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి-అరెకపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, కౌశిక్ ఇంటి వెలుపల రచ్చ, అరెస్టులు వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్టులు చేశారు. బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు