సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మేదినీపూర్ చౌరస్తాలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో వెనుక వైపు ఉన్న ఇంజన్ లో మంటలు చెలరేగి వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు నిలిపివేసి ఫైర్స్ సేఫ్టీ సహాయంతో మండలం ఆర్పి వేశారు. బస్సులో పది మంది ఉన్నట్టు తెలిపారు