భారీగా పెరిగిన కూరగాయల ధరలు
NEWS Sep 13,2024 05:42 am
కరీంనగర్: మొన్న శ్రావణమాసం, ప్రస్తుతం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూరగాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో కూరగాయల రేట్లు భారీగానే పెరిగాయి. బెండకాయ కిలో రూ.60-70, సొరకాయ 60, పచ్చిమిర్చి 80, కొత్తిమీర ఏకంగా కిలో 200 వరకు పలుకుతోంది. ఏ కూరగాయల ధరలు చూసినా మండిపోతున్నాయి. వర్షాల కారణంగా కూరగాయలు రావట్లేదని వ్యాపారస్థులు చెబుతున్నారు.