బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
NEWS Sep 13,2024 05:18 am
గజ్వేల్ పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిని ఈరోజు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, హరీష్ రావులను అరెస్టు నిరసిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డి తో పాటు పలువురు నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.