పోలీసులు స్వేచ్ఛను అణిచి వేస్తున్నారు
NEWS Sep 13,2024 05:18 am
మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు హైదరాబాద్‌కు వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు ముందుగానే వారి వారి ఇళ్లలోకి వెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ.. పోలీసులు తమ స్వేచ్ఛను అణిచి వేస్తున్నారని ఉదయాన్నే ఇంట్లోకి వచ్చి గృహ నిర్బంధం చేయడం సబబు కాదని మండిపడ్డారు.