బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
NEWS Sep 13,2024 05:41 am
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో రామాయంపేట పిఏసిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్ బుర్ర అనిల్ కుమార్, ఎస్.కె హైమద్, పుట్టి యాదగిరి, కొండల్ రెడ్డి, చింతల్ రాముల, మల్యాల కిషన్ పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.