చోరీకి యువతి యత్నం - దేహశుద్ధి
NEWS Sep 13,2024 04:49 pm
చోరీకి యత్నించిన యువతి చివరికి స్థానికులకు చిక్కింది. ఈ ఘటన రామచంద్రపురం పట్టణంలోని శీలంవారి సావరం రోడ్డులో గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. స్థానిక విద్యుత్ కార్యాలయం మీదుగా ఇద్దరు మహిళలు నడుస్తూ వెళ్తున్నారు. అటుగా బైక్‌పై వచ్చిన ఓ యువతి మహిళ మెడలో గొలుసు లాక్కొని పరారయ్యేందుకు యత్నించింది. అప్రమత్తమైన తోటి మహిళ, స్థానికులు ఆమెను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.