చుక్క నీరు లేకుండా ఏలేరు..
NEWS Sep 13,2024 04:50 pm
కాకినాడ జిల్లాలోని 4 నియోజకవర్గాలో వరద బీభత్సం సృష్టించిన ఏలేరు శుక్రవారం చుక్క నీరు లేకుండా కనిపిస్తోంది. వారం రోజుల పాటు పెద్దాపురం మొదలు పిఠాపురం వరకు వేలాది ఎకరాల పంట పొలాలను, వందలాది గ్రామాలను వరద నీటితో ఏలేరు ముంచెత్తింది. శుక్రవారం పూర్తిగా వరద నీటి ప్రభావం నిలిచిపోయింది. దీంతో వరద ప్రభావిత గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎండ రావటంతో కూడా వరద నుండి విముక్తి లభిస్తుందని తెలిపారు.